Monday, 2 January 2017

చిరంజీవికి సినిమా కష్టాలు ప్రీ రిలీజ్ ఫంక్సన్ కి ఆటంకాలు

     
       
                                 చిరంజీవి నటిసున్న 150వ చిత్రం కైది నెం150 ప్రీ రిలీజ్  ఫంక్షన్ ఈ నెల 4 వ తేది విజయవాడ లో నిర్వహిస్తున్నామని ఈ ఫంక్సన్ కి అందరు రావాలని రాంచరణ్ సోషల్ మీడియా ద్వారా అందరిని ఆహ్వనిచాడు.కానీ ఇప్పుడు ఆ ఫంక్సన్ వాయిదా పడే పరిస్తితులు కనిపిస్తున్నాయి.మొదట విజయవాడ లో ఫంక్సన్ ఫిక్స్ చేసారు,కానీ అక్కడి అధికారులు  అనుమతులు ఇవ్వక పోవడంతో గుంటూరు లో చేయాలని భావించారు,కనీ అక్కడ అనుమతి
లభించలేదు.
                      దీనికి కారణం అధికార పక్షం లోని నాయకులేనని మెగా అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.తమ సినిమాని సంక్రాంతి బరి నుండి తప్పించాలని కావాలనే  అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది కి గురిచేస్తున్నారని సోషల్ మీడియాలో రచ్చ చేస్తునారు.
             వాస్తవానికి ఈ సినిమా కి సంబందించి ఇప్పటివరకు నిర్మాతలు పబ్లిసిటి చేయలేదు.
ఆడియో ఫంక్సన్ కూడా చేయకుండా  పాటలు యుట్యుబ్ లో  రిలీజ్ చేసారు.తిర పబ్లిసిటి స్టార్ట్ చేసేసరికి ఇలా ఆటంకాలు ఎదురు అవుతున్నాయి.ప్రస్తుతం గుంటూరు  దగ్గర హాయ్ ల్యాండ్ లో ఫంక్సన్ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తునారు.చిరంజీవి  ఈ ఆటంకాలని ఎలా ఎదుర్కొంటాడో వేచి చూడాలి  మరి. 

Sunday, 13 November 2016

నాగచైతన్య పై నోట్ల రద్దు ఎఫెక్ట్....

       
       నాగచైతన్య ఇప్పుడు మంచి స్పీడుమీద ఉన్నాడు.వరసగా సినిమాలు రిలీజ్ చేస్తూ హిట్ లు అందుకుంటున్నాడు.దసరాకి ప్రేమంతో వచ్హి హిట్ అందుకున్న చైతు ఇప్పుడు సాహసం స్వాసగా సాగిపో తొ ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్హాడు.ఈ చిత్రాన్ని గౌతం మీనన్ డైరెక్ట్ చేసాడు.అయితే నోట్ల రద్దు ప్రభావం ఈ సినిమా పై గట్టిగానే పడింది.
        దసరాకి రిలీజ్ అయిన ప్రేమం కి మొదటి రోజు 5.7 కోట్ల గ్రాస్..  3.5 కోట్ల షేర్ వస్తే ఈ మూవీకి మాత్రం 3.9 కోట్ల గ్రాస్ 2 కోట్ల షేర్ మత్రమే వచ్హిందట. దసరా పోటీలొ రిలీజ్ అయిన ప్రేమం కంటే సోలోగా రిలీజ్ అయిన ఈచిత్రాని కలెక్షన్లు తగ్గడంతో నోట్ల రద్దు ప్రభావం ఈచిత్రం పై గట్టిగానే పడిందని అంటున్నారు.అయితే చైతు మాత్రం సినిమాకి పాజిటివ్ టాక్ రావడం తో  పాటు కాంపిటీషన్ లో ఏ సినిమాలు లేకపోవడంతో లాంగ్ రన్ లో కలెక్షన్స్ వస్తాయని దీమాగా వున్నాడట.

ధ్రువ టార్గెట్ ఫిక్స్ చేశాడు..

                 
                         'ధ్రువ' ఈ చిత్రం మొదలైనప్పటినుంచి టైటిల్ తోనే ప్రత్యేకమైన అంచనాలను ఏర్పరుచుకుంది.రామ్మ్ చరణ్ గత చిత్రాలు అనుకున్న స్తాయిలో ఆడక పోవడంతో ఈసినిమాతో ఎట్టి పరిస్తితులలో బ్లాక్ బస్టర్ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.తాజాగా ఈచిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.సినిమాకి సంబందిచిన పాటలు ట్రైలర్ ఇప్పటికే పెద్ద హిట్ అవ్వడంతో సినీజనాలు ఈచిత్రంపై ఆసక్తి చూపుతున్నారు.రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని అల్లూఅరవింద్ గీతాఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.హిప్ హాప్ తమిజ అనే తమిళ సంగీత దర్శకుడు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.మరి ధ్రువ తన టార్గెట్ ని చేరుకుంటాడో లేదో చూడాలి.

వెంకటేష్ కొత్త సినిమాలో పవనే హైలెట్..!!

   
           విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెకుతున్న కొత్త చిత్రం గురు.తమిళంలో హిట్ అయిన 'ఇరుదు సుట్రు ' అనే మూవికి రీమేక్ గా ఈ సినిమాని తీస్తున్నారు.ఈ చిత్రంలో వెంకీ బాక్సింగ్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు.ఆయన శిష్యురాలిగా రితికాసింగ్ నటిస్తుంది.సుధ కొంగర అనే కొత్త లేడీ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన చాలా సందర్బాలలో వస్తుందట.
              ఈ చిత్రంలో కథానాయిక పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపిస్తుందట.తమిళ వెర్సన్ లొ హీరోయిన్ ను ధనుష్ ఫ్యాన్ గా చూపించారు.తెలుగులో పవర్ స్టా ర్  అభిమానిగా చూపిస్తున్నారట.వెంకీ కి పవన్ కి మంచి సన్నిహిత్యం వుంది.ఇద్దరు గోపాలగోపాల మూవీ కూడా చేసారు.హీరోయిన్ ను ఎవరి అభిమానిగా చూపిద్దాం అన్న సంభాషణ వచ్చినపుడు వెంకీ నే పవన్ పేరు సూచించాడంట. ఈ మద్య చాలా సినిమాలలో పవన్,మహేష్ ల రెఫరెన్సులు చూస్తూనే ఉన్నాం.మరి ఈసినిమా లో పవన్ ఏరేంజ్ లో హైలైట్ అవుతాడో చూడాలి.

Saturday, 12 November 2016

బాలయ్య ఫ్యాన్స్ పవర్ ఏంటో చూపిస్తున్నారు...

          బాలక్రిష్న హీరోగా నటిస్తున్న100వ చిత్రం "గౌతమీపుత్ర శాతకర్ణి".దీనిని డైరెక్టర్ క్రిష్ ఎంతో  ప్రతిస్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.బాలక్రిష్ణ 100వ చిత్రం కావడం చరిత్రలో నిలిచిపోయిన వీరుడికథ కావడంతో నిర్మాణ విలువలలో ఎక్కడా తేడా రాకుండా నిర్మిస్తున్నారు.సీనియర్ నటీనటులు,సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.ఇది బాలక్రిష్ణ కెరీర్ లో మైలురాయి కావడంతో ఫ్యాన్స్ ఇప్పటినుంచే చిత్రంపై అంచనాలను పెంచుకుంటున్నారు.ఈ చిత్రానికి సంబందించి ఇప్పటినుంచే పబ్లిసిటీ చేస్తున్నారు.

                         గౌతమీపుత్ర శాతకర్ణి యాత్ర పేరుతో భారతదేశంలోని పుణ్యక్షేత్రాలన్ని సందర్శిస్తున్నారు.ప్రచారచిత్రాలతో డిసైన్ చేసిన వాహనాలతో భారతదేశం మొత్తం పర్యాటిస్తున్నారు. ప్రొద్దుటూరు అర్చన థియేటర్ లో బాలక్రిష్ణ నటించిన 99 చిత్రాలని రోజుకి ఒక చిత్రం లెక్కన సినిమా రిలీజ్ అయ్యేవరకు అంటే జనవరి 12 వరకు ప్రదర్శింస్తున్నారు.ఇలాంటి రికార్డులు ఇప్పటివరకు చిత్రసీమ లో ఏ హీరోకి లేవు.కాబట్టి బాలక్రిష్ణ అబిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

పవర్ స్టార్ తన టైమింగ్ ని నిరూపించుకుంటాడా..!!

     
          "నేను టైం ని నమ్మను నాటైమింగ్ ని నమ్ముతాను" అని గబ్బర్ సింగ్ లొ పవన్ డైలాగ్ చెప్తాడు.ఆ టైమింగ్ కరెక్టే అని ఇప్పుడు నిరూపించుకో వలసిన టైం వచ్చింది.ఎందుకంటే పవన్ నటుడు గా ఈసంవత్సరం మూడు సినిమాలు ఒప్పుకున్నాడు.కాటమరాయుడు ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటుంది.ఇది కంప్లీట్ అయిన తరువాత త్రివిక్రం తొ ఒకటి,ఆర్ టి నేసన్ తొ ఏఎం  రత్నం నిర్మించబోయే సినిమా మరొకటి.ఈ సినిమాల అన్నింటిని పవన్ కల్యాన్ 2017 లో రిలీజ్ చెయ్యాలని కమ్మిట్ అయ్యాడంట.అయితే గత చిత్రాల్ని పరిశీలిస్తే ఏ సంవత్సరం రెండు కంటే ఎక్కువ సినిమాలని పవన్ కల్యాన్ విడుదల చెసిన ధాకలాలు లేవు.అదీ కాక పవన్ ఇప్పుడు రాజకీయాలలో కూడా ప్రముఖ పాత్రపోషిస్తున్నారు. భహిరంగ సభలు,డిల్లీ టూర్ లు ఇలా రాజకీయపరంగా కూడా చాలనే ఫిక్స్ అయ్యాడు. మరి అనుకున్న టైం లొ సినిమాలని రిలీజ్ చేసి తన టైమింగ్ ని నిరూపించు కుంటాడో లేదో చూడాలి.

NTR అభిమానులకి మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్.....

               యంగ్ టైగర్ NTR నటించిన జనతాగ్యారేజ్ రిలీజ్ అయినప్పటి నుంచి అభిమానులనే కాకుండా టాలివుడ్ మొత్తాన్ని నిరీక్షింపజేసిన ప్రశ్న.. తరువాత సినిమా ఎవరితో..దీనిపై చాలానే ర్యుమర్స్ వచ్హాయి.త్రివిక్రం శ్రీనివాస్ తొ వుంటుందని,వివి వినయక్ తొ ఉంటుందని,తన అన్నకి పటాస్ లాంటి హిట్ ఇచ్హిన అనిల్ రావిపూడి తొ ఫిక్స్ అయిందని రకరకాల వార్తలు ఫిల్మ్ ఇడస్ట్రి లొ హల్చల్ చేసాయి.కానీ రీసెంట్ గా ఒక వార్త ప్రచారంలోకి వచ్హింది. అది ఎంటంటే తన నెక్స్ట్ మూవి మల్టిస్టారర్ అంట.NTR తొ నటించబొయె స్టార్ హీరో  ఎవరొ కాదు స్టయిలిష్ స్టార్ అల్లూఅర్జున్.

             అవును వీరిద్దరితొ సినిమా తీయడానికి ఒక భడా నిర్మాత సన్నాహాలు చెస్తున్నాడంట.ఈ సినిమాకి డైరక్టర్ కూడా ఫిక్స్ అయ్యాడంట.NTR కూడా ఈ ప్రొజెక్ట్ పై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. అల్లూఅర్జున్ ని ఒప్పించే పనిలో నిర్మాతలు ఉన్నారంట.NTR తీసుకుంటున్న ఈ నిర్నయాన్ని సినీ పరిశ్రమ మొత్తం అబినందిస్తుంది.  అయితే నందమూరి వంశానికి మెగాప్యామిలి కి ఎప్పటినుంచొ సినిమాల పరంగా గాని రాజకీయపరంగా గాని కొల్డ్ వార్ జరుగుతూ వస్తుంది.అలాంటి పరిస్తితులలో ఈ మల్టిస్టారర్ చిత్రన్ని ఇరువర్గాల అభిమానులు ఎలా స్వీకరిస్తారో వేచిచూడాలి.